బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 12:56:17

విజయవాడ ‘జీజీహెచ్‌’ సూపరింటెండెంట్‌పై మహిళా ఉద్యోగి ఫిర్యాదు

విజయవాడ ‘జీజీహెచ్‌’ సూపరింటెండెంట్‌పై మహిళా ఉద్యోగి ఫిర్యాదు

విజయవాడ : లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ విజయవాడ గవర్నమెంట్‌ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) సూపరింటెండెంట్‌పై శుక్రవారం రాత్రి దిశా పోలీస్‌స్టేషన్‌లో మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది.  ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జీజీహెచ్‌లో ఓ మహిళ కొత్తగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధుల్లో చేరింది. ప్రస్తుతం కరోనా విభాగంలో ఆమె విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో సూపరింటెండెంట్ తనను లైంగికంగా వేధించాడని, లొంగకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిందని దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ వీవీ.నాయుడు చెప్పారు. మహిళ కొన్ని ఫొటోలను, ఆడియో రికార్డింగ్‌లను తమకు అప్పగించిందని, ఐపీసీ సెక్షన్ 354ఏ, ఐటీ చట్టం సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


logo