బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 07:02:32

పొలంలో తాళ్లతో కట్టేసి వివాహితపై లైంగిక దాడి

పొలంలో తాళ్లతో కట్టేసి వివాహితపై  లైంగిక దాడి

జల్నా : ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై నేరాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట వారిపై అగయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర జల్నా జిల్లాలో పొలంలో పనికి వెళ్లిన మహిళపై కౌలు రైతుతోపాటు అతడి డ్రైవర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. జల్నా తాహసిల్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (21) భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఉంటోంది.

వ్యవసాయ కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. గురువారం స్థానికంగా ఓ కౌలు రైతు పొలంలో పనికి వెళ్లగా అతడు ఆమెపై కన్నేశాడు. కౌలు రైతు, అతడి డ్రైవర్ ఆమెను తీవ్రంగా కొట్టి తాడుతో కట్టేసి పొలంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టుకు హాజరుపర్చగా  ఏడు రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె దవాఖానలో చికిత్స పొందుతోందని, పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo