శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 09, 2020 , 14:39:22

ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే.. యువతి ఆత్మహత్య

ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే.. యువతి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని మోత్కూర్ మండలం దాతప్పగూడెంలో వివాహిత నవిత(22) క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందింది. గత మార్చిలోనే ప్రేమ పెండ్లి చేసుకున్న నవిత అత్తింటి వారి వేధింపులు భరించలేక  ఈ నెల 2న గ్రామంలో పురుగుల మందు తాగింది. ఆమెను గమనించిన స్థానికులు హైదరాబాద్‌కు తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. నవిత మృతికి అత్త, మామతో పాటు భర్త కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo