బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 08:56:04

గ‌చ్చిబౌలిలో మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి

గ‌చ్చిబౌలిలో మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి ఎన్టీఆర్ న‌గ‌ర్‌లో ఓ మ‌హిళ అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. గ‌త నాలుగు రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన ఆ మ‌హిళ ఇంటి స‌మీపంలోని మ‌రో గ‌దిలో మ‌హిళ విగ‌త జీవిగా ప‌డిఉంది. ఆ గ‌ది నుంచి దుర్వాస‌న రావ‌డంతో మృత‌దేహాన్నిస్థానికులు గుర్తించారు. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. 

కాగా, మృతుల‌రాలు గ‌త కొన్నిరోజులుగా క‌నిపించ‌డం లేద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు ఈనెల 26న గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నాలుగురోజుల్లోనే వారి ఇంటి స‌మీపంలోనే మ‌హిళ మృతిచెంది క‌న్పించ‌డం పులు అనుమానాల‌కు తావిస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.  


logo