శనివారం 06 మార్చి 2021
Crime - Jan 27, 2021 , 11:26:31

శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రంగారెడ్డి: రాజధాని హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్ద తుప్పర వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను మోటార్‌ సైకిల్‌ ఢీకొట్టింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా, బైక్‌పై వెళ్తున్న యువకుడు సమీపంలోని కరెంటు పోల్‌ని ఢీకొట్టాడు. దీంతో అతడు కూడా మరణించాడు. మృతుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

VIDEOS

logo