ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 13:20:59

ప్రియురాలికి విష‌మిచ్చిన‌ ప్రియుడు, భార్య‌

ప్రియురాలికి విష‌మిచ్చిన‌ ప్రియుడు, భార్య‌

కురుక్షేత్ర : ఓ ప్రియుడు త‌న భార్య‌తో క‌లిసి.. ప్రియురాలికి విష‌మిచ్చి చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌ర్యానాలోని కురుక్షేత్ర‌లో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. కురుక్షేత్ర‌లోని భోలి గ్రామానికి చెందిన పింకీకి ర‌వి అనే వ్య‌క్తితో ప‌దేళ్ల క్రితం వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే ర‌వి డ్ర‌గ్స్ కు బానిస అయ్యాడు. దీంతో మూడేళ్ల క్రితం భ‌ర్త నుంచి వేరుప‌డి మ‌కాంను ఆకాశ్ న‌గ‌ర్‌కు మార్చింది. ఆకాశ్ న‌గ‌ర్‌లో పింకీ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటోంది. 

ఇక్క‌డ పింకీకి గంగా సింగ్ అనే వ్య‌క్తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. గంగా సింగ్ మంచి మ‌ద్యం ప్రియుడు. గ‌త కొన్ని రోజుల నుంచి పింకీని గంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. త‌న‌కు మ‌ద్యం తాగేందుకు డ‌బ్బులివ్వాల‌ని ఆమెను హింసిస్తున్నాడు. దీంతో ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో పింకీ కూతురు త‌న సోద‌రుడికి విష‌యం చెప్పింది. 

మొత్తానికి పింకీ ఇంటికి గంగా సింగ్ త‌న భార్య‌తో క‌లిసి ఆగ‌స్టు 8న వ‌చ్చాడు. ఆమెకు శీత‌ల పానీయాల్లో విష ప‌దార్థం క‌లిపి ఇచ్చారు. ఆమె ఆ పానీయాన్ని సేవించిన కొద్దిసేప‌టికే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. వాంతులు చేసుకోవ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ పింకీ క‌న్నుమూసింది. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి బిడ్డ‌, కుమారుడు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.


logo