బుధవారం 03 జూన్ 2020
Crime - Mar 03, 2020 , 07:49:49

జీహెచ్‌ఎంసీ చెత్త లారీ ఢీకొని మహిళ మృతి

జీహెచ్‌ఎంసీ చెత్త లారీ ఢీకొని మహిళ మృతి

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : కాప్రా మండలంలోని రాధిక చౌరస్తాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న రాధిక మున్సిపాలిటీ ఏరియా సూపర్‌ వైజర్‌ని జీహెచ్‌ఎంసీ చెత్త లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహిళా అక్కడికక్కడే మృతిచెందింది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

మరొక ఘటనలో మెదక్‌ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ శివారులో పెళ్లి వ్యాన్‌ బోల్తాపడింది. 20 మంది వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


logo