శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 17:00:39

వ‌ర‌క‌ట్న దాహానికి మ‌హిళ‌, చిన్నారి బ‌లి!

వ‌ర‌క‌ట్న దాహానికి మ‌హిళ‌, చిన్నారి బ‌లి!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం భ‌దోహి జిల్లాలో దారుణం జ‌రిగింది. వ‌ర‌క‌ట్నం కోసం అత్తింటివారు పెట్టే చిత్ర హింస‌లు భ‌రించ‌లేక ఓ మ‌హిళ త‌న మూడేండ్ల కూతురుతో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గ్రామ స‌మీపంలోని చెరువులో తేలియాడుతున్న మృతదేహాల‌ను చూసి గ్రామ‌స్తులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను వెలికితీయించి పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. 

అనంత‌రం మృతురాలి భ‌ర్త‌, అత్త‌, మామ‌, మ‌రిదిల‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సులేఖ (26) త‌న మూడేండ్ల కూతురు సోనాలితో క‌లిసి గ్రామ శివారులోని చెరువులో శ‌వ‌మై తేలింది. ఆమె మృతికి వ‌ర‌క‌ట్న వేధింపులే కార‌ణ‌మ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. త‌న కూతురు, మనుమ‌రాలు మృతికి అల్లుడు వినోద్ చౌహాన్‌, అత‌ని త‌ల్లిదండ్రులు, మ‌రిది కార‌ణ‌మ‌ని మృతురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 

అంతేగాక‌, త‌న కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని, అత్తింటి వారే త‌న కూతురు, మ‌నుమ‌రాలును గొంతు పిసికి చంపి చెరువులో ప‌డేశార‌ని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఆ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo