మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 20:39:27

ముగ్గురు కుమార్తెలతో కలిసి బావిలో దూకి మహిళ ఆత్మహత్య

ముగ్గురు కుమార్తెలతో కలిసి బావిలో దూకి మహిళ ఆత్మహత్య

భరత్‌పూర్‌ : ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో.. అభం శుభం తెలియని ముగ్గురు ఆడపిల్లలను తీసుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఆదివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రూప్‌వాస్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని సూరజ్‌పూర్‌ గ్రామానికి చెందిన శారదాదేవికి రవిసింగ్‌తో పదిహేనేండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు కాగా.. రవి వృత్తిరీత్యా చెన్నైలో ఉండేవాడు. శారద గ్రామంలో కూలి పనులకు వెళ్తూ పిల్లలను సాకేది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మహిళ ముగ్గురు కుమార్తెలతో కలిసి అటవీ ప్రాంతంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే మహిళ తన కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo