శనివారం 30 మే 2020
Crime - May 13, 2020 , 11:48:17

భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

 హైదరాబాద్‌ : తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఓ యువతి తాను పనిచేస్తున్న 15వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ ల్యాంకోహిల్స్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన ఎర్ర వల్లిక (20) మణికొండ ల్యాంకోహిల్స్ 3వ టవర్ 15వ అంతస్తులోని 1503 ఫ్లాట్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో రెండున్నర నెలలుగా పని మనిషిగా వర్క్‌ చేస్తున్నది. కాగా ఉదయం తన తల్లితో ఫోన్ లో మాట్లాడింది. వాళ్ల అక్కకు వారం క్రితమే పుట్టిన పాపను చూడాలని ఉందని, ఊరికి వస్తానని అమ్మతో చెప్పింది. తల్లి ఇందిరమ్మ వద్దని వారించడంతో మనస్థాపానికి గురైన వల్లిక 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
logo