ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 15:08:10

భర్తను చంపి పడక గదిలో పాతిపెట్టి..

భర్తను చంపి పడక గదిలో పాతిపెట్టి..

ధలై : త్రిపుర రాష్ట్రంలోని ధలై జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య కట్టుకున్న వాడినే హతమార్చి పడక గదిలోనే పాతేసింది. భక్తికుమార్పారా గ్రామానికి చెందిన భారతి (21), సంజిత్‌ రీయాంగ్‌ (30) దంపతులకు మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి ఇద్దరి నడుమ మరోమారు వాగ్వాదం జరగడంతో భారతి భర్తను చంపి ఇంట్లోని పడక గదిలో పాతిపెట్టి పారిపోయింది.

గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఇంటిని శోధించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరానికి పాల్పడిన భారతిని ఆదివారం అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధలై జిల్లా ఎస్పీ కిశోర్ డెబ్బర్మ తెలిపారు. సాధారణ ప్రక్రియలో నిందితురాలికి కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా కేంద్రంలోని అంబస్సా ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo