శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 10:37:42

నల్లా వద్ద నీళ్లు పట్టుకుంటుండగా కత్తితో దాడి.. మహిళ మృతి

నల్లా వద్ద నీళ్లు పట్టుకుంటుండగా కత్తితో దాడి.. మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం : నీళ్లు పట్టుకునేందుకు బయటకు వచ్చిన ఓ మహిళ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్ది కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన హబీబా బేగం అనే మహిళ శనివారం ఉదయం మంచినీళ్ల కోసం బయటకు వచ్చింది. ఈ క్రమంలో నల్లా వద్ద నీళ్లు పట్టుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియరాలేదు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo