బీజేపీ నేతపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యా యత్నం

సంగారెడ్డి : బీజేపీ నేత, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరువులోని హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తనను లైంగిక వేధించిన రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతోంది. అంతకు ముందు ఆమె సెల్ఫీ వీడియోను తీసుకుంది. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. అంతే కాదు తనకు ప్రాణహాని కూడా ఉందని ఆమె అప్పట్లో చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. అయితే ఆమె ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. అత్యాచారం కేసులో తనకు న్యాయం చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పొలం దున్నుతుండగా గుప్తనిధి లభ్యం !
- అవును.. ఆ గబ్బిలాలు మమ్మల్ని కుట్టాయి.. వాటి వల్లే కరోనా!
- మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..!
- త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌పై బీజేపీ మద్దతుదారుల దాడి ?
- బెంగళూరు వదులుకునే ఆటగాళ్లు వీరే..!
- రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీంకోర్టు విచారణ
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్