Crime
- Dec 04, 2020 , 18:45:37
బావిలో పడి మహిళ మృతి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మి రోజువారీగా తమకున్న వ్యవసాయ పనుల నిమిత్తం గురువారం చేనులోకి వెళ్ళింది. పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో బావి దగ్గర ఉన్న డ్రమ్ములో నీరు పట్టడానికి వెళ్ళింది. కుటుంబీకులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం బావిలో పడి ఉన్నట్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. తన తల్లి పట్ల ఎవరికి ఎటువంటి అనుమానం లేదని కాలు జారి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిందని మృతురాలి కుమారుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
తాజావార్తలు
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్‌కు టీకాలు.. భారత్‌ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్‌వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
MOST READ
TRENDING