బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 07, 2020 , 14:40:38

17వ అంతస్తు పైనుంచి దూకి.. తల్లీ కుమారుడు మృతి

17వ అంతస్తు పైనుంచి దూకి.. తల్లీ కుమారుడు మృతి

నోయిడా: ఒక అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తు పైనుంచి దూకి తల్లి, ఆమె నాలుగేండ్ల కుమారుడు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సొసైటీ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ మహిళ, నాలుగేండ్ల కుమారుడ్ని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. సొంతూరుకు వెళ్లిన ఆమె భర్త విషయం తెలిసి నోయిడాకు తిరిగి ప్రయాణమయ్యారు. నోయిడాలో ప్రైవేట్‌ కాలేజీలో చదువుతున్న ఆయన చెల్లెలు హాస్టల్‌లో ఉంటున్నది. ఆమె తరచుగా తన అన్న ఇంటికి వస్తుంది.

కాగా ఆయన లేనప్పుడు ఆమె ఆ ఇంట్లో ఉన్నది. ఈనేపథ్యంలో వదినకు ఆమెకు మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె వదిన తన కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్న యువతి ముఖానికి కాలిన గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం ఆమెను దవాఖానకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo