బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 22:16:11

బావిలో మహిళతో సహా ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలు.. అత్తింటి వారే హతమార్చారా.!

బావిలో మహిళతో సహా ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలు.. అత్తింటి వారే హతమార్చారా.!

భరత్‌పూర్‌ : మహిళతోపాటు ఆరేండ్లలోపు ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పదంగా బావిలో శవాలై తేలారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ఖాన్సూర్‌జాపూర్ గ్రామానికి చెందిన శారదా దేవి (28)కి ఆరేండ్లలోపు ముగ్గురు కుమార్తెలు త్రిష (6), అపూర్వా (4), అవీ (ఏడాదిన్నర) ఉన్నారు. భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా ఆమె పిల్లలతో అత్తారింట్లోనే ఉంటోంది. సోమవారం అందరితో కలిసి ఉన్న శారదాదేవి ఆమె పిల్లలు మంగళవారం ఉదయం సమీపంలోని బావిలో శవాలై కనిపించారు.

స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. అనుమానాస్పద కేసు కావడంతో మెడికల్ బోర్డు సభ్యులతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు రూప్వాస్ పోలీస్ స్టేషన్ అధికారి హుకుమ్ సింగ్ తెలిపారు. ఇదిలాఉండగా బావ, అత్త, మరిది కలిసి నలుగురిని హత్య చేశారని, కొంతకాలంగా అత్తామామలు తమ కూతురును కట్నం కోసం వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo