మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 15, 2021 , 18:56:05

వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు

వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు

పెద్దపల్లి : వన్య ప్రాణిని చంపి మాసం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి షౌ కత్ అలీ తెలిపారు.  ఆయన కథనం ప్రకారం.. జిల్లాలోని మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో శుక్రవారం కొండ గొర్రెను వధించి మాంసం విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన పాలకొండ సారయ్య, ముత్తారం మండలం మైదం బండ గ్రామానికి చెందిన కేతిరి రమేష్‌ను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కిలోల మాసం, కత్తులు, తోలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌వోలు హాసన్ ఖాన్, అన్వర్, అమిదుద్దిన్, తిరుపతి, ఎఫ్బీవోలు అఫ్జల్, శ్రావణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

టీకా ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తీసుకోవ‌ద్దు ? 

క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలో మంత్రి అల్లోల‌ 

మంటల్లో పడి వృద్ధురాలి సజీవదహనం 

VIDEOS

logo