బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 24, 2020 , 18:30:09

హత్రాస్ దర్యాప్తు అధికారి భార్య ఆత్మహత్య

హత్రాస్ దర్యాప్తు అధికారి భార్య ఆత్మహత్య

లక్నో : హత్రాస్ సంఘటనపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యుడు చంద్ర ప్రకాష్ భార్య శనివారం లక్నోలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలు 36 ఏండ్ల పుష్ప ప్రకాష్ గా గుర్తించారు. ఆమె తన ముగ్గురు కుమార్తెలతో రాష్ట్ర రాజధాని నగరంలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో బస చేస్తున్నారు. ఆమె భర్త, డీఐజీ చంద్ర ప్రకాష్. ప్రస్తుతం ఉన్నవోలోని పోలీసు శిక్షణ పాఠశాలలో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం చంద్ర ప్రకాశ్ తన కార్యాలయానికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్ప బెడ్రూంలో ఫ్యానుకు ఉరేసుకుని జీవితాన్ని ముగించినట్లు పోలీసులు తెలిపారు. అదనపు డిప్యూటీ కమిషనర్ (సౌత్ జోన్) సురేష్ చంద్ర, సుశాంత్ గోల్ఫ్ సిటీ పీఎస్ ఇన్స్పెక్టర్ సచిన్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం ఆర్‌ఎంఎల్ దవాఖానకు పంపించారు.

మరో సంఘటనలో, బండా జిల్లాలోని మహుతా గ్రామంలోని తన ఇంట్లో బెయిల్‌పై బయటకు వచ్చిన 45 ఏండ్ల హిస్టరీ షీటర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం . 10 కేసుల్లో నిందితుడిగా ఉన్న సౌరభ్ శుక్లా మొన్నటి వరకు చిత్రకూట్ జైలులో ఉన్నారు. గత వారం బెయిల్ పొందాడని అత్తారా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అఖిలేష్ మిశ్రా తెలిపారు. గురువారం సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదిలావుండగా, పంజాబ్‌లోని బతిండాలోని గ్రీన్ సిటీ ప్రాంతంలో శుక్రవారం భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన 41 ఏండ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగుస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.