మంచు మోహన్ బాబు నట వారసురాలు మంచు లక్ష్మీ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ఈవెంట్లో అయిన మంచు లక్ష్మీ చేసే సందడి మాములుగా ఉండదు. హోస్ట్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులని అలరించిన మంచువారమ్మాయి. ఆమె యాస, భాషతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కొన్ని సార్లు ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటుంది. దానిని కూడా పాజిటివ్‌గానే తీసుకొని ముందుకు సాగుతుంది.
తండ్రి మోహన్ బాబుని అమితంగా ప్రేమించే మంచు లక్ష్మీ ఆయన బర్త్ డే వేడుకలను విద్యానికేతన్ స్కూల్లో ఘనంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదానాలు, ఆట పాటలతో ఆ ప్రాంగణం అంతా సందడిగా మారింది. అయితే మేళతాళాలకు అనుగుణంగా మంచు లక్ష్మీ చేసిన డ్యాన్స్ అందరిని ఆకర్షిస్తుంది. అదరిపోయే స్టెప్పులు వేశావు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.