శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 12:21:11

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

సూర్యాపేట : అనుమానంతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని పెన్‌పహాడ్‌ మండలం జల్మలకుంట తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. లునావత్‌ స్వామి, లునావత్‌ సరోజ(35)కు గత కొన్నేండ్ల క్రితం వివాహమైంది. అయితే సరోజ.. తన మామతో అక్రమ సంబంధం కొనసాగించింది. విషయం తెలుసుకున్న స్వామి.. తన తండ్రిని హత్య చేశాడు. ఈ హత్య కేసులో స్వామి జైలుకు వెళ్లి.. వారం రోజుల కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. మొత్తానికి మళ్లీ భార్యపై అనుమానం కలగడంతో.. ఆమెను శుక్రవారం రాత్రి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo