బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 31, 2020 , 14:45:37

ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

అమరావతి: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ మెడకు చుట్టి భర్తను హత్యచేసి.. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తల్లికి కొడుకు మృతి పై అనుమానం రావడంతో అసలు నిజం బయటకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తూరు కాలేజ్ రోడ్డుకు అనుకుని రాము(35), కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పాప శ్రీజ(7), బాబు సిద్దూ(5) ఉన్నారు. అయితే అక్టోబర్ 26న మరణించాడు.

ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఊరివేసుకుని ఉన్నట్టు కనిపించాడు. తొలుత అంతా ఆత్మహత్య అని భావించగా...అతని తల్లి మాత్రం తన కొడుకు ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని వాదించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాముమృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి పంపించారు. అయితే పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో రాముది హత్యగా తేలింది. దీంతో పోలీసులు రాము మృతిపై విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే రాము భార్య కుమారికి అదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించారు. దీంతో కుమారితోపాటు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరు నేరాన్ని అంగీకరించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే రామును హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వారు విచారణలో పోలీసులకు చెప్పారు. ఇందులో భాగంగా రామును సెల్‌ఫోన్ చార్జర్‌తో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. తొలుత సెల్‌ఫోన్ చార్జింగ్ వైరు రాము మెడకు చుట్టి అతని ప్రాణం తీశామని.. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకన్నాడని నమ్మించే విధంగా ప్లాన్ చేశామని నిందితులు చెప్పారు. రాము మెడకు చున్నీ చుట్టి ఫ్యాన్‌కు వేలాడదీశామని తెలిపారు. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. https://www.youtube.com/watch?v=oKugv9ccgIQ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.