ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 17:15:10

ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన భార్య‌

ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన భార్య‌

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లోని మైసూర్ లో దారుణం జ‌రిగింది. ఓ భార్య త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను అంత‌మొందించింది. కేఆర్ న‌గ‌ర్ కు చెందిన శార‌ద‌, ఆనంద్ కు కొన్నేళ్ల క్రితం వివాహ‌మైంది. అయితే బాబు అనే మ‌రో వ్య‌క్తితో శార‌ద‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అయితే ఆనంద్ కు అనుమానం వ‌చ్చి భార్య‌ను నిలదీశాడు. త‌మ సంబంధానికి అడ్డు వ‌స్తున్నాడ‌ని భావించిన భార్య‌.. భ‌ర్త‌ను చంపాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో ప్రియుడు బాబుతో క‌లిసి ఆనంద్ ను చంపింది. బాబు గొడ్డ‌లితో ఆనంద్ త‌ల‌పై బాదాడు. ఆ త‌ర్వాత ఘ‌ట‌నాస్థ‌లి నుంచి 2 కిలోమీట‌ర్ల దూరం బైక్ పై తీసుకెళ్లి.. ఆనంద్ డెడ్ బాడీని రోడ్డు ప‌క్క‌కు వ‌దిలారు. 

మొత్తానికి ఆనంద్ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మొద‌ట రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించింది శార‌ద‌. అయితే యాక్సిడెంట్ కేసులు ఇటీవ‌ల న‌మోదు కాక‌పోవ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. లోతుగా ద‌ర్యాప్తు చేయ‌డంతో.. నేరం చేసిన‌ట్లు శార‌ద‌, బాబు అంగీక‌రించారు. వీరిద్ద‌రిని రిమాండ్ కు త‌ర‌లించారు పోలీసులు.


logo