ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 10:57:13

కొడుకు ఫ్రెండ్ తో భార్య ఎఫైర్ ... నరికి చంపిన భర్త

కొడుకు ఫ్రెండ్ తో భార్య ఎఫైర్ ... నరికి చంపిన భర్త

చెన్నై : కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను కత్తితో నరికి చంపాడు ఆ భర్త. ప్రియుడిపై దాడి చేయగా అతను   తృటిలో తప్పించుకున్నాడు. తమిళనాడులోని నాగర్ కోవిల్ నగరంలోని ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు 19 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. భర్త వడ్రంగి వ్యాపారం చేస్తుంటాడు. కొయ్యల వ్యాపారం చేసే భర్త 10కి పైగా ఇండ్లు కట్టి అద్దెలకు ఇచ్చాడు. అద్దెలు సంపాదించిందంతా భార్యకే ఇచ్చేవాడు. డబ్బులు బాగా రావడంతో భార్య జల్సాలకు అలవాటు పడింది. కొడుకుతో వచ్చే యువకుడిపై మనసుపడ్డ ఆమె ఆ యువకుడిని రెచ్చగొట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అతడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ తనివితీరా కోర్కెలు తీర్చుకుంది.

ఆ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళుతున్నాడని ఇంటిపక్కన వారు భర్తకు ఫిర్యాదు చేశారు. కంట్రోల్ లో పెట్టుకో అని హెచ్చరించారు. ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం 4 గంటలకు ఇంటికి రాగా బెడ్రూరంలో భార్య ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండడం చూసి షాక్ అయ్యాడు. కోపంతో రగిలిపోయి కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ప్రియుడు కూడా నగ్నంగా ఉండి బయటకు పరుగులు తీశాడు. అతడిపై దాడి చేయగా తప్పించుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.  


logo