సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 18, 2020 , 14:06:45

కోవిడ్ రోగుల వ‌ద్ద మందులను కొట్టేసి బ్లాక్‌లో అమ్ముతున్న వైనం

కోవిడ్ రోగుల వ‌ద్ద మందులను కొట్టేసి బ్లాక్‌లో అమ్ముతున్న వైనం

హైదరాబాద్ : కోవిడ్ రోగుల వ‌ద్ద కొట్టేసిన ఇంజెక్ష‌న్లు, మందులను కొనుగోలు చేసి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్న ఓ మెడిక‌ల్ దుకాణం య‌జ‌మానిని పోలీసులు అరెస్టు చేశారు. దుకాణ‌దారుడితో పాటు మ‌రో ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న న‌గ‌రంలోని మెహ‌దీప‌ట్నంలో చోటుచేసుకుంది. ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. మెహ‌దీప‌ట్నం ప్రాంతంలోని ఆలివ్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న రవి రాజు, అజిస్ అదేవిధంగా సమీరా అనే ఆస్పత్రిలో పనిచేసే ఒబేద్ అలీ, అశ్వక్ అలీ, ఎల్బీన‌గ‌ర్‌లోని మెడిసిస్ ఆసుపత్రిలో పనిచేసే సునీల్ మ‌రో సేల్స్‌మెన్ మజీద్ వీరంతా ఇన్‌పేషెంట్‌గా ఉన్న కోవిడ్ రోగుల వ‌ద్ద నుంచి ఇంజెక్ష‌న్లు, మందుల‌ను దొంగిలిస్తున్నారు.

కొట్టేసిన ఇంజెక్ష‌న్లు, మందులను మెహ‌దీప‌ట్నంలోని ఓ మెడిక‌ల్ దుకాణంలో అమ్మేవారు. మెడిస‌న్ ఖ‌రీదు రూ. 4,500 అయితే బ్లాక్‌లో రూ. 25 వేల నుండి రూ. 35 వేల వ‌ర‌కు విక్ర‌యిస్తు సొమ్ముచేసుకుంటున్నారు. ఫిర్యాదుల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని ఎల్బీన‌గ‌ర్ పోలీసుల‌కు అప్ప‌గించారు. 


logo