మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 08:35:22

26.25 కిలోల బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

26.25 కిలోల బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

సిలిగురి : పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి అక్రమంగా తరలిస్తున్న 26.25 కిలోల బంగారాన్ని శుక్రవారం రాత్రి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో రూ .14.5 కోట్లు ఉందని అధికారులు తెలిపారు. అరెస్టయిన నిందితులను సౌరభ్ షమరవ్ షిర్కాండే (23), సందేశ్ అప్ప నారాలే (21), శశికాంత్ తనజైకుటే (25)గా గుర్తించారు.

వీరు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంతకాలంగా బంగారాన్ని ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులు మహారాష్ట్ర చెందిన వారని తెలిపారు. వీరిని పోలీసులకు అప్పగించగా సిలిగురి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు న్యాయమూర్తి రెండురోజుల రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.


logo