శనివారం 16 జనవరి 2021
Crime - Jan 10, 2021 , 11:59:45

కేపీహెచ్‌బీ కాలనీలో లిఫ్టు గుంతలో పడి వాచ్‌మెన్‌ మృతి

కేపీహెచ్‌బీ కాలనీలో లిఫ్టు గుంతలో పడి వాచ్‌మెన్‌ మృతి

హైదరాబాద్‌: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో దుర్ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ లిఫ్టు గుంతలో పడి మృతిచెందారు. వాసంశెట్టి త్రిమూర్తులు అనే వ్యక్తి కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలోని ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-2లో ఉన్న ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. భవనం మెట్లు ఎక్కిదిగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలోపడి పోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.