శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 15:19:49

బీర్ బాటిల్ తో డాక్టర్ ను కొట్టి చంపిన వాచ్ మ్యాన్

బీర్ బాటిల్ తో డాక్టర్ ను కొట్టి చంపిన వాచ్ మ్యాన్

అమరావతి:  నెల్లూరు జిల్లా రాపూరు మండలం పులిగిలపాడులో ఓ అశ్రమానికి సంబంధించిన వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది. వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ రవీంద్ర నాయక్ ను వాచ్ మెన్ అంకయ్య దారుణంగా హత్య చేశాడు. బీర్ బాటిల్ తో తలపగలగొట్టి ఆపై మృతదేహాన్ని జోరేపల్లి సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు తీసుకెళ్ళి పెట్రోలు పోసి దహనం చేశాడు.

మే14వ తేదీన డాక్టర్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో జరిగిన ఘర్షణలో హత్య చేసినట్టు చెబుతున్నారు. అక్రమసంబంధమే హత్యకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. డాక్టర్ ఫోన్ పని చెయ్యకపోవడమే కాక ఆరోజు నుంచి  వైద్యశాలలో డాక్టర్ కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మే 14 వ తేదిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  logo