బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 04, 2020 , 14:07:28

పక్కా ప్రణాళికతో వచ్చారు.. గోల్డ్‌ చైన్‌తో ఉడాయించారు..

పక్కా ప్రణాళికతో వచ్చారు.. గోల్డ్‌ చైన్‌తో ఉడాయించారు..

న్యూఢిల్లీ : ముగ్గురు దుండగులు పక్కాప్రణాళికతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. మాటల్లో పెట్టి అతడి మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైక్‌పై ఉడాయించారు. న్యూఢిల్లీలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ చోరీ తంతు మొత్తం సమీపంలోని ఓ సీసీ కెమెరాలో నిక్షిప్తమమైంది. రోడ్డు వెంట వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి మెడలో ముగ్గురు దుండగులు బంగారు గొలుసు గమనించారు. వీరిలో ఒకరు అతడికి ఎదురుగా వచ్చి కాలు అడ్డుగా పెట్టి గొడవ పడ్డాడు. మరో ఇద్దరు బైక్‌పై వచ్చి మావాడికే కాలు తగిలిస్తావా అంటూ బైక్‌ను అతడి చుట్టూ తిప్పుతూ అడ్డుకున్నారు. అనంతరం గొడవపడిన యువకుడు ఉద్యోగి మెడలోని గొలుసు లాక్కొని, ముఖంపై కొట్టడంతో కిందపడగా ముగ్గురు కలిసి బైక్‌పై పరారయ్యారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo