శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 01, 2020 , 22:12:56

కొవిడ్‌-19 పాజిటివ్‌ మహిళను వేధించిన వార్డుబాయ్‌ అరెస్ట్‌

కొవిడ్‌-19 పాజిటివ్‌ మహిళను వేధించిన వార్డుబాయ్‌ అరెస్ట్‌

పుణె: కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళను శారీరకంగా వేధించిన ఓ ప్రైవేట్‌ దవాఖాన వార్డుబాయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా పుణెలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేరింది. ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నది. 

వార్డులో ఆమె ఒంటరిగా ఉండడం గమనించిన, దవాఖాన వార్డుబాయ్‌ మహిళను శారీరకంగా వేధించాడు. అప్పుడే వార్డులోకి వచ్చిన దవాఖాన మహిళా సిబ్బంది అతడిని నిలదీయగా, అక్కడి నుంచి పారిపోయాడు. సదరు వార్డుబాయ్‌ అశోక్‌ గవాలిగా గుర్తించిన పోలీసులు అతడిపై ఐసీపీ సెక్షన్‌ 354 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo