ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 11:12:19

ట్రైనీ వైద్యురాలిపై వార్డు బాయ్‌ అసభ్య ప్రవర్తన

ట్రైనీ వైద్యురాలిపై వార్డు బాయ్‌ అసభ్య ప్రవర్తన

ముంబై: ఒక ట్రైనీ వైద్యురాలిపై వార్డు బాయ్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శిక్షణలో ఉన్న ఒక మహిళా డాక్టర్‌ పట్ల 30 ఏండ్ల వయసున్న వార్డ్‌ బాయ్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడు గతంలో కూడా దవాఖానలోని పలువురితో గొడవ పడినట్లు పోలీసులు తెలిపారు. 

logo