మంగళవారం 07 జూలై 2020
Crime - Jun 04, 2020 , 12:58:38

వరంగల్ లో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

వరంగల్ లో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

వరంగల్ అర్బన్ : తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగని వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వరంగల్ సీపీ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం..సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అఫ్రోజ్ అనే నిందితుడు తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడని, అతడిని అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు 475 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, రూ. 25,0000 నగదు, ఐదు ఎల్ఈడీ టీవీలు, నాలుగు ల్యాప్ టాప్ లు, రెండు సెల్ ఫోన్లు, ఆరు కెమెరాలు, డిజిటల్ వాచ్, చలువ కండ్లద్దాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.logo