వక్ఫ్ బోర్డు సభ్యుడి లైంగికదాడి కేసు నమోదు

ముంబై : స్థానిక వక్ఫ్ బోర్డు సభ్యుడిపై మహీం పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. నిందితుడిని పీర్ మఖ్దుమ్ సాహెబ్ ఛారిటబుల్ ట్రస్ట్ ధర్మకర్త డాక్టర్ ముదాసిర్ నిసార్ లాంబేగా గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు మహీం పోలీసులు తెలిపారు.
ఫిర్యాదులో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదాసిర్ నిసార్ లాంబే గత ఏడాది జనవరి 28 న ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులో మునిగిపోయిన తర్వాత లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు మహిళను ముదాసిర్ లాంబే తన క్లినిక్‌లోనే లైంగికదాడి జరిపాడు. ఈ సంఘటన గురించి ముదాసిర్ లాంబేను ఆ మహిళ ప్రశ్నించగా.. ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసాడు. కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న లాంబే.. ఇటీవల ఆమెను పెండ్లి చేసుకునేందుకు తిరస్కరించాడు. పోలీసులను సంప్రదించినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు.
సదరు మహిళను ముదాసిర్ లాంబే గోవాండిలో జరిగిన ఒక కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నాడు. అక్కడ వారు ఫోన్ నంబర్లను మార్పిడి చేసుకున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గత ఏడాది జనవరిలో ముదాసిర్ లాంబేను తన క్లినిక్‌లో కలిసింది. ఈ సమయంలో లాంబే ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇటీవల ఆమె బెదిరించిన వీడియో వైరల్ అయింది. దాంతో మహీం పోలీసులు రంగంలోకి దిగి ముదాసిర్ లాంబేపై లైంగికదాడి కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి