గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 16:37:01

రూ.5 లక్షల రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

రూ.5 లక్షల రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

న్యూఢిల్లీ: వాంటెడ్ క్రిమినల్ ధావల్ త్రివేదిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. రూ.5 లక్షల రివార్డు ఉన్న అతడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్, అంతరాష్ట్ర పోలీస్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వృత్తి‌పరంగా ఉపాధ్యాయుడైన ధావల్ త్రివేది, ట్యూషన్ల‌కు వచ్చే బాలికలను లోబరుచుకుని వారిపై లైంగికదాడులకు పాల్పడేవాడు. పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై కేసులు నమోదు కాగా ముంబై నుంచి పారిపోయాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు సహరించిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ముంబై సీబీఐ ప్రకటించింది. కాగా ధావత్ త్రివేది ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్, అంతరాష్ట్ర పోలీస్ బృందాలు అతడి కదలికలపై నిఘా ఉంచి ఆదివారం అరెస్ట్ చేశాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo