శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 15:05:05

పిపారియాలో విశ్వ హిందూ పరిషత్‌ నాయకుడి హత్య

పిపారియాలో విశ్వ హిందూ పరిషత్‌ నాయకుడి హత్య

మధ్యప్రదేశ్‌ : సిపారియాలో విశ్వ హిందూ పరిషత్‌ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం హత్య చేశారు. వీహెచ్‌పీ నాయకుడైన రవి విశ్వకర్మ హోషంగాబాద్‌ నుంచి పిపారియాలోని తన నివాసానికి కారులో వస్తుండగా రైల్వే వంతెన కింద సుమారు 6 గురు మాటు వేసి రాడ్లు, కర్రలతో ఆయనపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేసి రవిని బైటికి తీసి విచక్షణారహితంగా కొట్టారు. అదే సమయంలో పోలీసులు వస్తుండడంతో దుండగులు రివాల్వర్‌తో రవిని కాల్చగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకొని కేసులో పురోగతి సాధిస్తామని సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి శివేందు జోషి అన్నారు. 


logo