బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 12:51:18

స‌ర్పంచ్ దారుణ హ‌త్య‌.. పోలీసు స్టేష‌న్‌కు నిప్పు

స‌ర్పంచ్ దారుణ హ‌త్య‌.. పోలీసు స్టేష‌న్‌కు నిప్పు

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అజాంఘ‌ర్ జిల్లాలోని ఓ గ్రామ స‌ర్పంచిని దారుణంగా హ‌త్య చేశారు. స‌ర్పంచ్ హ‌త్య‌కు నిర‌స‌న‌గా పోలీసు స్టేష‌న్‌కు, వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు. స‌ర్పంచ్ స‌త్య‌మేవ జ‌య‌తే అలియాస్ పప్పు రామ్ నివాసానికి ఆయ‌న శ‌త్రువు శుక్ర‌వారం ఉద‌యం వెళ్లారు. అనంత‌రం పప్పు రామ్ పై తుపాకీతో ఆరు రౌండ్ల కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. స‌ర్పంచ్‌ను హ‌త్య చేశార‌ని తెలియ‌డంతో.. ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న‌కు దిగారు. పోలీసు స్టేష‌న్‌కు, వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ ఆందోళ‌న‌ల్లో ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. 

ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. స‌ర్పంచ్‌ను హ‌త్య చేసిన నిందితుడిని గుర్తించి క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని సీఎం పోలీసుల‌ను ఆదేశించారు. స‌ర్పంచ్ కుటుంబ స‌భ్యుల‌కు యోగి ప్ర‌గాఢ సానుభూతి  తెలిపారు. త‌క్ష‌ణ సాయం కింద రూ. 5 ల‌క్ష‌లు  ప‌రిహారం ప్ర‌క‌టించారు.


logo