చండీగఢ్: భద్రతాపరమైన తనిఖీ కోసం ఒక కారును పోలీస్ ఆపబోగా డ్రైవర్ ఆయనపైకి వాహనాన్ని దూకించాడు. దీంతో ఆ పోలీస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్‌లోని పాటియాలాలో శనివారం ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో నల్ల జెండాతో ఉన్న కారును తనిఖీ కోసం ఆపేందుకు ఒక పోలీస్ ప్రయత్నించారు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా పోలీస్ మీదకు దూసుకెళ్లాడు. ఆ పోలీస్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై పడిన ఆయనకు గాయాలయ్యాయి. ఆ పోలీస్‌ను ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ కారును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, పోలీస్‌పైకి కారును దూకించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.