శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 12:35:58

అదుపుతప్పి బైకులను ఢీకొట్టిన కారు.. బావ, బావమరిది దుర్మరణం

అదుపుతప్పి బైకులను ఢీకొట్టిన కారు.. బావ, బావమరిది దుర్మరణం

పిలిభిత్ : ఉత్తర ప్రదేశ్‌ పిలిభిత్‌ జిల్లా పిలిభిత్-మాధోతండ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైకులను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఖాస్పూర్ గ్రామానికి రామ్‌దాస్‌ తన సోదరుడు భగవాన్ దాస్ (32)తో కలిసి బైక్‌పై పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యలో అతడికి బావమరిది వరుసయ్యే దేవ్‌దాస్‌ కనిపించడంతో ఇద్దరు రోడ్డు వెంట బైకులను నిలిపి మాట్లాడుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకులను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

రామ్‌దాస్‌ ఘటనా స్థలానికి కొంతదూరంలో ఉండటంతో అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసు ఉన్నతాధికారులు వారికి సర్ది చెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. రామ్‌దాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo