గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 16, 2020 , 07:56:03

బీజేపీ ఎమ్మెల్యేపై లైంగికదాడి ఆరోపణలు

బీజేపీ ఎమ్మెల్యేపై లైంగికదాడి ఆరోపణలు

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే తనపై రెండేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ ఆరోపించింది. ఎమ్మెల్యే కారణంగానే తనకు కూతురు జన్మించిందని ఆక్షేపించింది. తన కుమార్తె డీఎన్‌ఏ నమూనాను ఎమ్మెల్యే డీఎన్‌ఏతో సరిపోల్చాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే భార్య డెహ్రాడూన్ నెహ్రూకాలనీ పోలీస్ స్టేషన్లో సదరు మహిళతోపాటు మరో నలుగురిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే తనతో రెండేళ్లుగా శారీరక సంబంధం కొనసాగించాడని, తన కూతురు డీఎన్‌ఏ భర్త డీఎన్‌ఏతో సరిపోలడం లేదని, ఆమె పుట్టుకకు ఎమ్మెల్యేనే కారణమని ఆరోపిస్తూ ఇటీవల ఓ మహిళ వీడియోను విడుదల చేసింది. తన కూతురు డీఎన్‌ఏతో ఎమ్మెల్యే డీఎన్‌ఏ నమూనాను సరిపోల్చాలని కోరిందని డెహ్రాడూన్ ఎస్‌ఎస్‌పీ అరుణ్ మోహన్ జోషి తెలిపారు. ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


logo