శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 18:05:21

చిన్నారిని చంపిన చిరుత కాల్చివేత

చిన్నారిని చంపిన చిరుత కాల్చివేత

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ప్రతాప్‌నగర్‌లోని దేవాల్ ప్రాంతంలో ఇటీవల చిన్నారుతోపాటు పశువులను బలిగొన్న చిరుతను శనివారం అటవీశాఖ షూటర్లు కాల్చి చంపినట్లు డివిజన్‌ అటవీ అధికారి డాక్టర్ కోకో రోజ్ తెలిపారు. ఆగస్టు 3న దేవాల్‌ ప్రాంతంలో చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చింది. మూడు ఆవులు కుక్కపై దాడి చేసి చంపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు చిరుతను పట్టుకునేందుకు వేటగాళ్లను మోహరించారు. అయినా చిక్కకుండా తప్పించుకొని తిరుగుతుండడంతో హతమార్చేందుకు నిర్ణయించి ఈ నెల 21 నుంచి ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో చిరుతను కాల్చి చంపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo