శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 19:28:16

చిరుత సంచారం.. వణికిపోతున్న గ్రామస్తులు

చిరుత సంచారం.. వణికిపోతున్న గ్రామస్తులు

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ జిల్లా భారత-నేపాల్ సరిహద్దు గ్రామం చందేలిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్నిరోజులుగా ఇక్కడ చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు పెంపుడు జంతువులపై చిరుత దాడి చేసి హతమార్చడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల రాత్రివేళ చిరుత సంచరించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడంతో ఖటిమా అటవీశాఖ రేంజర్ బీఎస్ బిష్ట్‌ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దాని కదలికను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీ శాఖ ఎస్‌డీఓ బాబు లాల్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo