బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 16:50:56

రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి

రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని దోయివాలా ప్రాంతంలో సోమవారం రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ఏనుగుల మంద రైలు పట్టాలను దాటుతుండగా తల్లివెంట వెళ్తున్న పిల్ల ఏనుగును రైలు ఢీకొట్టింది. రైలు ఢీకొన్న వేగానికి ఏనుగు పిల్ల ఎగిరి 10 అడుగుల లోతు లోయలో పడి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి లాచివాలా, థానోరేంజ్ అటవీశాఖ రేంజ్‌ అధికారి ఎన్ఎల్ దోబల్‌కు సమాచారం అందించారు. నక్రోండా గులార్ఘాటి జీరో పాయింట్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఏనుగు కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కారణంగానే ఏనుగు పిల్ల మృతి చెందిందని దోబల్‌ తెలిపారు.


logo