గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 17, 2020 , 08:52:16

బాలికపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్టు

బాలికపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్టు

సీతాపూర్‌ : ఉత్తర ప్రదేశ్ సీతాపూర్లోని బిస్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీనేజ్ బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు సీతాపూర్ ఉత్తర ఏఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదిలాఉండగా లఖింపూర్ ఖేరి జిల్లా ఇసానగర్‌లో శనివారం రాత్రి 13 ఏండ్ల బాలికపై చెరుకు తోటలో కొందరు సామూహిక లైంగిక దాడి చేసి హతమార్చారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయంటూ ఇటీవల కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించిన సంగతి విధితమే.logo