ఆదివారం 17 జనవరి 2021
Crime - Nov 15, 2020 , 20:37:52

విదేశీ కరెన్సీ, భారీగా బంగారం స్వాధీనం

విదేశీ కరెన్సీ, భారీగా బంగారం స్వాధీనం

చెన్నై: విమాన ప్రయాణికుల నుంచి విదేశీ కరెన్సీతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వేర్వేరు విమానాల ద్వారా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. మూడు ఘటనల్లో పది వేల అమెరికా డాలర్లు, రూ.41.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీ, బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మూడు వేర్వేరు ఘటనలపై కస్టమ్స్‌ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి