సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 11:26:38

మ‌రో మ‌హిళ‌తో అస‌భ్య‌క‌ర ఫోటోలు.. భార్య ఆత్మ‌హ‌త్య‌

మ‌రో మ‌హిళ‌తో అస‌భ్య‌క‌ర ఫోటోలు.. భార్య ఆత్మ‌హ‌త్య‌

నోయిడా : ఓ భ‌ర్త త‌న భార్య‌ను కాద‌ని.. మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఆమెతో అస‌భ్య‌క‌రంగా దిగిన ఫోటోల‌ను భార్య చూసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న నోయిడాలో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

నోయిడాకు చెందిన జ‌గ్వీర్ కుమార్ కు సోన‌మ్ అనే మ‌హిళ‌తో 8 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. వీరి సంసారం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఆ త‌ర్వాత కుమార్ మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌ర్చుకున్నాడు. ఈ విష‌యం సోన‌మ్ కు తెలిసి భ‌ర్త‌తో గొడ‌వ ప‌డింది. దీంతో భార్య‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేశాడు.  ఈ క్ర‌మంలో ఇరుకుటుంబాల పెద్ద‌లు క‌ల్పించుకుని స‌ర్ది చెప్పారు. ఆ త‌ర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్నాడు. 

మ‌ళ్లీ అదే మ‌హిళ‌తో త‌న సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఆమెతో ప్ర‌యివేటుగా దిగిన ఫోటోలు సోనమ్ కంట‌ప‌డ్డాయి. ఈ విష‌యాన్ని అత్త‌మామ‌ల దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఆమెకు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. కుమార్ త‌ల్లి, సోద‌రిమ‌ణులు కూడా సోన‌మ్ ను హింసించారు. అద‌న‌పు క‌ట్నం తేవాల‌ని ఒత్తిడి తెచ్చారు.

ఈ క్ర‌మంలో సోన‌మ్ గురువారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సోన‌మ్ ఆత్మ‌హ‌త్య‌పై ఆమె సోద‌రుడు సోను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo