ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 15:42:27

పెళ్లిలో స్వీట్ల గొడవ.. బామ్మర్దిని చంపిన వరుడు

పెళ్లిలో స్వీట్ల గొడవ.. బామ్మర్దిని చంపిన వరుడు

లక్నో : పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న స్వీట్ల గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ స్నేహితులకు స్వీట్లు ఇవ్వలేదని పెళ్లి కుమారుడు.. వధువు తమ్ముడిని గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శంషాబాద్‌ ఏరియాలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

పెళ్లి కుమారుడు మనోజ్‌ కుమార్‌, అతని స్నేహితులు కలిసి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తమకు స్వీట్లు పంచడం లేదని గొడవ పెట్టుకున్నారు. ఈ వివాదం కాస్త ముదరడంతో.. ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో వరుడి స్నేహితులు.. ఇష్టమొచ్చినట్లు పరుష పదజాలంతో దూషించారు. 

అంతటితో ఆగకుండా అక్కడ్నుంచి తప్పించుకుపోతున్న వారు.. కారును జనాలపై నుంచి పోనిచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు. వధువు తమ్ముడిని తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గ్రామంలో వదిలి పారిపోయారు మనోజ్‌, అతని స్నేహితులు. 

వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వరుడితో పాటు వారి బంధువులు, స్నేహితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


logo