బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 08, 2020 , 16:19:47

భార్య మ‌ర‌ణంపై క‌ల‌త‌... పిల్లల్ని చంపి తాను ఆత్మ‌హ‌త్య

భార్య మ‌ర‌ణంపై క‌ల‌త‌... పిల్లల్ని చంపి తాను ఆత్మ‌హ‌త్య

చండీగ‌ర్ : భార్య మ‌ర‌ణంపై క‌ల‌త చెందిన వ్య‌క్తి ముగ్గురు పిల్ల‌ల్ని చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న పంజాబ్‌లోని బటిండా జిల్లా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హ‌మీర్‌గ‌ర్ నివాసి బీంట్ సింగ్. ఇత‌నికి భార్య, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. రిక్షాపై స‌రుకుల‌ను ర‌వాణా చేయ‌డం ఇత‌డి జీవ‌నోపాధి. కాగా రెండు నెల‌లక్రితం భార్య క్యాన్స‌ర్ వ్యాధితో చ‌నిపోయింది. భార్య మ‌రణించడంతో బీంగ్ సింగ్ తీవ్ర వేద‌నలోకి వెళ్లాడు. జీవితాన్ని ముగించ నిశ్చ‌యించుకున్నాడు. దీంతో మొద‌ట‌గా త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను ప్ర‌భుజోత్ సింగ్‌(7), అర్ష్‌దీప్ కౌర్‌(3), ఖుషి(1)ని చంపి అనంత‌రం తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సంఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులు ఆత్మ‌హ‌త్య లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు. 


logo