e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News యువకుడ్ని కట్టేసి కొట్టడంతోపాటు కరెంట్‌ షాకులు

యువకుడ్ని కట్టేసి కొట్టడంతోపాటు కరెంట్‌ షాకులు

లక్నో: ఒక యువకుడ్ని కొందరు కట్టేసి దారుణంగా కొట్టడంతోపాటు కరెంట్‌ షాకులు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. సెహత్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్హియా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు పింటూ రాజ్‌భర్ అనే యువకుడి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం దారుణంగా కొట్టారు. అంతేగాక ఆ యువకుడికి కరెంట్‌ షాకులు కూడా ఇచ్చారు.

తీవ్రంగా గాయపడిన పింటూను అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. పింటూ సోదరుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు నలుగురు వ్యక్తులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement