శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 25, 2020 , 13:12:02

ప్ర‌తిఘ‌టించ‌డంతో.. మూడో అంత‌స్తు నుంచి తోసేశారు

ప్ర‌తిఘ‌టించ‌డంతో.. మూడో అంత‌స్తు నుంచి తోసేశారు

ల‌క్నో : ఓ యువ‌తిని లైంగింక వేధించి.. మూడో అంత‌స్తు నుంచి కింద‌కు తోసేశారు. ప్ర‌స్తుతం బాధితురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌నూ జిల్లాలో అక్టోబ‌ర్ 23న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఓ 15 ఏళ్ల యువ‌తి శుక్ర‌వారం రాత్రి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా.. ముగ్గురు యువ‌కులు ఆమెను అడ్డ‌గించారు. బ‌ల‌వంతంగా ఓ భ‌వ‌నంలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించారు. యువ‌తి ప్ర‌తిఘ‌టించ‌డంతో.. కోపంతో యువ‌కులు ఆమెను మూడో అంత‌స్తు నుంచి కింద‌కు తోసేశారు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన బాధితురాలిని అజాంఘ‌ర్ జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. యువ‌తి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని, దాంతో ప్ర‌తిఘటించ‌డంతోనే కింద‌కు తోసేశారు. త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని బాధితురాలు పేర్కొన్నారు.