శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 13:01:53

గుడిసె కూలి ముగ్గురు చిన్నారులు దుర్మరణం..

గుడిసె కూలి ముగ్గురు చిన్నారులు దుర్మరణం..

ఫతేపూర్‌ : ఉత్తర ప్రదేశ్‌ ఫతేపూర్‌ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వర్షానికి గుడిసె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఫతేపూర్‌ జిల్లా రత్వాఖేరా గ్రామానికి చెందిన సునీల్ పాల్ కుటుంబం గుడిసెలో జీవనం సాగిస్తుంది. శనివారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా గుడిసె పైకప్పు కూలడంతో సునీల్‌ పాల్‌ ముగ్గురు పిల్లలు శిశుపాల్ (2), సభజీత్ (5), గుధియా (15) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఆరుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికుల సాయంతో బింద్కి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు పోలీస్‌ అధికారి సత్యేంద్ర సింగ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo