ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 17, 2020 , 22:18:07

ఒకరిపై ద్వేషంతో తనపైనే కాల్పులు జరిపించుకున్న పూజారి

ఒకరిపై ద్వేషంతో తనపైనే కాల్పులు జరిపించుకున్న పూజారి

లక్నో: ఒకరిపై రాజకీయ ద్వేషం వల్ల ఒక ఆలయ పూజారి తనపైనే తుపాకీ కాల్పులు జరిపించుకున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దీనిని రట్టు చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ గోండా జిల్లాలోని శ్రీరామ్‌ జానకి ఆలయం పూజారి అయిన అతుల్ త్రిపాఠి అలియాస్‌ సామ్రాట్ దాస్‌పై ఈ నెల 10 రాత్రి వేళ కొందరు తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయోధ్యకు చెందిన సాధువులు ఆ జిల్లాకు వచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అయితే దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. గ్రామ మాజీ సర్పంచ్‌ అమర్‌ సింగ్‌పై కుట్రతోనే గ్రామ సర్పంచ్‌ విజయ్‌ సింగ్‌, ఆలయ ప్రధాన పూజారి మహంత్‌ సీతారామ్‌ దాస్‌, గాయపడిన పూజారి సామ్రాట్‌ దాస్‌ కలిసి కుట్రపన్నారని, ప్రొషెనల్‌ షూటర్‌తో ఉద్దేశపూర్వంగా కాల్పులు జరిపించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన పూజారి, గ్రామ సర్పంచ్‌తో పాటు ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఒక దేశీయ తుపాకీ, ఏడు బులెట్లు, మొబైల్‌ ఫోన్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గాయపడిన పూజారి దాస్‌ కోలుకున్న తర్వాత ఆయనను కూడా అరెస్ట్‌ చేస్తామని పోలీసులు వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి